అప్పుడు బ్లాక్... ఇప్పుడు వైటా?

అప్పుడు బ్లాక్... ఇప్పుడు వైటా?

గత ఏడాది స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల డబ్బు అమాంతం 50 శాతం పెరిగిపోయింది... నోట్ల రద్దు తర్వాత తగ్గిపోయిన స్విస్ డిపాజిట్లు... ఉన్నట్టుండి పెరిగిపోయాయి. దీనిపై కాంగ్రెస్‌ చీఫ్ రాహుల్‌గాంధీ... ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్లు వేశారు. స్విస్‌ బ్యాంకుల్లో 50శాతం పెరిగిన భారతీయల డిపాజిట్‌ స్వచ్ఛమైన డబ్బేనని, నల్లధనం కాదని మోడీ అంటున్నారంటూ విమర్శలు గుప్పించిన రాహుల్... స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ఒకొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని 2014లో మోడీ చెప్పారని, 2016లో అయితే నోట్ల రద్దుతో నల్లధనం విరగడవుతుందని చెప్పుకొచ్చారని... ఇప్పుడు మాత్రం స్విస్‌బ్యాంకుల్లో 50 శాతం పెరిగిన భారతీయుల డిపాజిట్లు స్వచ్ఛధనమేనని చెబుతున్నారంటూ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గిన విషయాన్ని గుర్తు చేసిన రాముల్ గాందీ... మోడీ హయాంలోనే రికార్డు స్థాయిలో పెరిగాయని ట్వీట్ చేశారు.