కర్ణాటకలో కాంగ్రెస్ ధర్నా...

కర్ణాటకలో కాంగ్రెస్ ధర్నా...

కాంగ్రెస్-జేడీఎస్ నేతలు కర్ణాటక రాజ్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప బెంగళూరులోని రాజ్‌భవన్‌లో కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో హంగ్ ఏర్పడంతో మ్యాజిక్ ఫిగర్ స్థానాలను గెలవకున్నా.. 104 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి గవర్నమెంట్ ను ఫామ్ చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ యడ్యూరప్పను ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గవర్నమెంట్ ను ఫామ్ చేసేందుకు అనుమతి కోరినా.. గవర్నర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ నేతలు రాజ్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. జేడీఎస్ నేత కుమారస్వామి నిన్న గవర్నర్ ను కలిసిన అనంతరం.. తమకు గవర్నమెంట్ ను ఫామ్ చేసేందుకు అనుమతి ఇవ్వకపోతే ధర్నాకు దిగుతాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఒకవైపు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం.. మరోవైపు కాంగ్రెస్ నేతల ధర్నాలతో బెంగళూరులోని రాజ్‌భవన్‌ అట్టడుకుతుంది.