జల్లికట్టు వేడుకలకు హాజరైన రాహుల్ గాంధీ

జల్లికట్టు వేడుకలకు హాజరైన రాహుల్ గాంధీ

తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జల్లికట్టు ఉత్సవాలు జోరందుకున్నాయి. దక్షిణ తమిళనాడులోని మధురై జిల్లాలో నేటి నుంచి సంక్రాంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. అయితే.. మధురైలో జరుగుతున్న జల్లికట్టు పోటీలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, డీఎంకే ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ కొడుకు, యాక్టర్‌ ఉదయనిధితో కలిసి హాజరయ్యారు. సంప్రదాయ క్రీడ జల్లికట్టు మొదలైంది. ఈ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆవేశంతో దూసుకొస్తున్న ఎద్దులను కట్టడి చేస్తున్నారు. దాదాపు 200 ఎడ్లను పోటీల్లో వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో 150 కంటే తక్కువ మంది ఆటగాళ్లు జల్లికట్టులో పాల్గొంటున్నారు. అలాగే 50 శాత్ జనాన్నే పోటీలు చూసేందుకు అనుమతిస్తున్నారు.  ప్లేయర్లు కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌ చూపించాకే వారిని ఆటకు అనుమతించారు.