కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇవాళే.. ఆ పథకమే హైలైట్‌..!

కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇవాళే.. ఆ పథకమే హైలైట్‌..!

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో రెడీ అయింది పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలోని 'మానిఫెస్టో' కమిటీ ఈ ఎన్నికల ప్రణాళికకు రూపకల్పన చేసింది. ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఇవాళ ఉదయం 11.45 గంటలకు విడుదల చేస్తారు. 

నిరుపేదలకు నేరుగా ఆర్థిక తోడ్పాటు, యువతకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, పటిష్టమైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, విద్యా, వైద్య, ఆరోగ్య హక్కు లాంటి పలు కీలక అంశాలపై ప్రధానంగా  దృష్టిసారిస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టు సమాచారం. దేశంలో అత్యంత నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం అందిస్తూ 'న్యాయ్‌' పేరిట ఆ పార్టీ ప్రతిపాదించిన 'కనీస ఆదాయ హామీ పథకం'.. మేనిఫెస్టోలో హైలైట్‌ అని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు అద్దం పట్టేలా ఉంటుందని, కేవలం ఒక వ్యక్తి లేదా కొందరి అభిప్రాయాలకే పరిమితమవదని, పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ నిన్న రాహుల్‌ వ్యాఖ్యానించారు