పట్నా సాహిబ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా

పట్నా సాహిబ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా

నటుడు-రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా ఇవాళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మువ్వన్నెల కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరగానే కాంగ్రెస్ హైకమాండ్ షాట్ గన్ ను బీహార్ లోని పట్నా సాహిబ్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది. రెండుసార్లు ఈ సీటు నుంచి ఎంపీగా ఎన్నికైన శత్రుఘ్నకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ మారారు.

శత్రుఘ్న సిన్హాతో పాటు మరో నలుగురి పేర్లతో ఐదు స్థానాలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కొత్త జాబితాను నేడు విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్, పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్, ఫతేగఢ్ సాహిబ్, ఫరీద్ కోట్ లకు అభ్యర్థులను ప్రకటించింది.