కేసీఆర్.. చంచల్ గూడ జైలు రెడీగా ఉంది

కేసీఆర్.. చంచల్ గూడ జైలు రెడీగా ఉంది

కేసీఆర్ నీవు ఎక్కడి నుంచి వచ్చావో.. నీ చరిత్ర అంతా తెలుసు, నీకు చంచల్ గూడ జైలు రెడీగా ఉంది అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ... తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ మోసం చేసి గద్దెనెక్కాడన్నారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దాడని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ పథకం పేరిట మభ్యపెడుతూ ప్రజల్ని మరోసారి మోసం చేసాడని పొన్నాల పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదు. జనగాం నియోజకవర్గ ప్రజలకు ఏ ఒక్కరికైనా 3 ఎకరాల భూ పంపిణీ చేసిన దాఖలాలు లేవు అని పొన్నాల తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్తారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిచేయలేక టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ముందస్తు ఎన్నికలు నిర్వహించబోయే టీఆర్ఎస్ పార్టీ ప్రతి అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.