పొన్నాలకు లైన్ క్లియర్

పొన్నాలకు లైన్ క్లియర్

ఎట్టకేకలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్ అయింది. ఆయనకు జనగాం టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం తెలిపింది. దీంతో జనగాం టికెట్ పై ఉత్కంఠ వీడింది. ఇక టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం జనగాం నుంచి బరిలోకి దిగుతున్నారన్న వార్తలు ఒట్టివే అని తేలింది. పొన్నాలకు జనగాం సీటు ఓకే అయింది కాబట్టి కోదండరాం ఎక్కడి నుండి పోటీ చేస్తాడనేది చర్చనీయాంశం అయింది. అసలు పోటీ చేస్తాడా? లేదో? కూడా ప్రశార్ధకంగా మారింది. కోదండరాం కేవలం ప్రచారానికే పరిమితమయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రేపు మధ్యాహ్నం కాంగ్రెస్ తమ తుది జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పొన్నాల ఈ సాయంత్రానికి హైదరాబాద్ వస్తారని సమాచారం.