బతుకమ్మ చీరలు సిరిసిల్లలో నేయలేదా ?

బతుకమ్మ చీరలు సిరిసిల్లలో నేయలేదా ?

బతుకమ్మ చీరలు సిరిసిల్లవి కాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు. బతుకమ్మ చీరలను మహారాష్ట్ర నుంచి తెప్పించారని ఆయన ఆరోపించారు.  మహారాష్ట్ర నుంచి చీరలను తీసుకొస్తుండగా కామారెడ్డిలో ఆ లారీ బోల్తా పడిందని తెలిపారు. లారీ డ్రైవర్ ప్రశ్నిస్తే... బతుకమ్మ చీరలు తెస్తున్నామని చెప్పాడని షబ్బీర్ వివరించారు. గచ్చిబౌలిలో డంప్ చేయాలని చెప్పినట్టు డ్రైవర్ స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు.  మంత్రి కేటీఆర్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలు అని అర్థమైందని షబ్బీర్ విమర్శించారు.