రాష్ట్రంలో డిక్టేటర్ పాలన నడుస్తోంది...!

రాష్ట్రంలో డిక్టేటర్ పాలన నడుస్తోంది...!

తెలంగాణ రాష్ట్రంలో డిక్టేటర్ పాలన నడుస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు... కాంగ్రెస్ పార్టీని అవహేళన చేయడానికే టీఆర్ఎస్‌ ఆసక్తి చూపుతుందని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో రేజర్వేషన్ లపై రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలని అడిగే కేసీఆర్... రాష్ట్రంలో జడ్పీటీసీ, సర్పంచ్ లకు హక్కులు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే వెళ్లి చూసే టైం సీఎంకు లేదా? అన్నారాయన. సభ పెట్టాలని కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు వీహెచ్... ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, రైతులకు సంకెళ్లపై సభ పెట్టాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలి ఉపనేత షబ్బీర్ అలీని కోరారు. మీ ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగితే... సైలెంట్ గా ఉంటే ఎట్లా? అని ప్రశ్నించిన ఆయన... ఏప్రిల్ 10వ తేదీ తర్వాత జనంలోకి సమస్యని తీసుకెళ్దామని... కలిసి కొట్లాడి కేసీఆర్‌ని గద్దె దించుదాం అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు అనేది పక్కన పెడదామని కాంగ్రెస్ నేతలకు సూచించారు వీహెచ్. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్లమెంట్‌లో డ్రామా చేస్తోందని ఆరోపించిన వీహెచ్... సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసిన ప్రశాంత్ కి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.