సొంత ప్రయోజనాల కోసమే పార్టీలు మారారు

సొంత ప్రయోజనాల కోసమే పార్టీలు మారారు

సొంత ప్రయోజనాల కోసమే పలువురు పార్టీలు మారుతున్నారనీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా అన్నారు. బుధవారం ఆయన నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. 'ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కాంగ్రెస్‌ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. డబ్బు వెదజల్లి టీఆర్ఎస్ రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. పురపాలక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. మెజార్టీ మున్సిపాలిటీలు సాధించేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు ఉన్నారు.. ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడిపిస్తున్నాం. కాంగ్రెస్‌కు గెలుపోటమిలు కొత్తకాదు. కాంగ్రెస్‌ బలహీన పార్టీ కాదని.. ఎంతో చరిత్ర కల్గిన బలమైన పార్టీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం' అని కుంతియా అన్నారు.