దుబ్బాక ఉపఎన్నిక బ‌రిలో కాంగ్రెస్‌.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ చీఫ్‌

దుబ్బాక ఉపఎన్నిక బ‌రిలో కాంగ్రెస్‌.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ చీఫ్‌

దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీఅయిన ఆ స్థానాన్ని... రామ‌లింగారెడ్డి భార్య‌కు కేటాయిస్తే.. కాంగ్రెస్ పోటీ చేయ‌బోద‌ని.. ఈ విష‌యంలో పీసీసీ చీఫ్‌తో మాట్లాడి.. ఏక‌గ్రీవం చేసేందేకు తాను ఒప్పిస్తానంటూ ఈ మ‌ధ్యే స్టేట్‌మెంట్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. అయితే.. దుబ్బాక ఉప ఎన్నిక‌పై ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. దుబ్బాక బై పోల్‌లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దుబ్బాక ఎన్నికలపై ఎవ‌రు ఎన్ని మాట్లాడినా అది వారి వ్యక్తిగత‌మ‌న్న ఉత్త‌మ్... మండలాల వారిగా సమావేశాలు పెట్టాలని డీసీసీకి ఆదేశాలు జారీ చేశారు. దుబ్బాక బ‌రిలో కాంగ్రెస్ అభ్య‌ర్థిని నిల‌ప‌డానికి గ‌ల కార‌ణాన్ని కూడా తెలిపారు ఉత్త‌మ్... గతంలో టీఆర్ఎస్ పోటీ చేసింది కాబ‌ట్టే.. మేం కూడా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాగా, గ‌తంలో పాలేరు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చ‌నిపోతే.. తెలంగాణ రాష్ట్రస‌మితి పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను పోటీకి పెట్టిన సంగ‌తి తెలిసిందే.