'పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది'

'పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది'

తెలంగాణాలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ... అంగట్లో సరుకులను కొన్నట్లు సీఎం కేసీఆర్ మా ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం మా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా కొనుగోళ్లు చేస్తుందని మండిపడ్డారు. 2013లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేకున్నా.. మా అధిష్టానం ప్రతిపక్షం ఉండాలి వారికి అవకాశం ఇవ్వండని చెప్పింది. ఈ విషయంను కేసీఆర్ మర్చిపోయినట్లు ఉన్నారన్నారని షబ్బీర్ అలీ గుర్తుచేశారు.

టీఆర్ఎస్.. శాసనసభలో, శాసన మండలిలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేసే కుట్ర చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెపుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించండి. శాసన మండలిలో జీవన్ రెడ్డి లాంటి ప్రశ్నించే గొంతుక అవసరం. ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయండని షబ్బీర్ అలీ కోరారు.