తెలంగాణలో కాంగ్రెస్‌లో జోష్..

తెలంగాణలో కాంగ్రెస్‌లో జోష్..

ముందస్తు అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా... లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ 19,070 ఓట్లతో విజయం సాధించగా... భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4500 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డిపై 6270 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఆయన... అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి.. లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే.