కాంగ్రెస్‌కు 220 సీట్లు వరకూ వచ్చే అవకాశం

కాంగ్రెస్‌కు 220 సీట్లు వరకూ వచ్చే అవకాశం

కేంద్రంలో కాంగ్రెస్‌కు 220సీట్లు వరకూ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల మద్దతు కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్‌ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారన్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నానని వ్యాఖ్యానించారు. తుది విడతలో రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. మోడీని ప్రశ్నలు అడిగితే అమిత్‌ షా సమాధానమిస్తున్నారన్నారు. చివరి విడతలో రాజకీయ లబ్ది పొందేందుకే మోడీ ప్రయత్నం చేశారని ఆరోపించారు. మోడీ మాటతీరు, రాహుల్‌ మాట తీరుకు చాలా తేడా ఉందని స్పష్టంచేశారు.