'సారు కారు 16 కాదు.. బేకారు..!'

'సారు కారు 16 కాదు.. బేకారు..!'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా నిర్మించిన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ్టి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో పాత్రే లేదన్న ఆయన.. కేసీఆర్ పాలనలో సార, కార.. కేసీఆర్ సర్కార్‌ లా తయారైందన్నారు. ఇంత సార తాగాలి.. కార బుక్కాలి.. ఇంటికాడ ఉపాసం  పండుకోవాలి.. ఇదే రాష్ట్రంలో నడుస్తోంది తప్ప.. ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు. కేసీఆర్ సారు కారు 16 అంటూ ఈ మధ్య కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు సారు కారు..16 కాదు, సారు కారు.. బేకారు అంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఆట.. ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్యే ఉంటుందన్న రేవంత్ రెడ్డి.. ఇందిరాగాంధీ, వాజ్ పేయ్ ఆదర్శంగా పనిచేస్తామన్నారు.