తొలిసారి విడివిడిగా ఓటేసిన అవిభక్త కవలలు

తొలిసారి విడివిడిగా ఓటేసిన అవిభక్త కవలలు

బీహర్ లో అవిభక్త కవలలైన సబా- ఫరాలు తొలి సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సబా-ఫరా బిహార్‌లో తొలిసారి విడివిడిగా ఓటు వేశారు. పట్నానగరంలోని సమన్‌ పురా ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరికి తొలిసారి వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించున్నారు. అప్పట్లో వీరిద్దరిని ఒక్కరుగానే పరిగణించి ఓటు గుర్తింపుకార్డు ఇచ్చారు. కానీ శారీరకంగా కలిసి ఉన్నంతమాత్రన వారి వ్యక్తిగత హక్కులను కాదనడం సరికాదని వారిద్దరికి వేర్వేరు గుర్తింపు కార్డులు జారీ చేశారు. 918 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ చివరిదశ పోలింగ్‌లో తేలనుంది. ఏడో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది.