19 నెలల కనిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం

19 నెలల కనిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఉపశమనం ఇచ్చే వార్త వచ్చింది. రీటెయిల్ ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయికి చేరింది. జనవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటి వరకు అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. ప్రభుత్వం జారీ చేసిన గణాంకాల ప్రకారం జనవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం 2.05% ఉంది. డిసెంబర్ నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 2.19%గా ఉంది. ఇది నవంబర్ నెలలో 2.33%.

రీటైల్ ద్రవ్యోల్బణంతో పాటు టోకు ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ లో టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) 8 నెలల కనిష్ట స్థాయి దగ్గర ఉంది. డిసెంబర్ లో టోకు ద్రవ్యోల్బణం 3.80%గా ఉంది. ఇంధనం, ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో టోకు ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. నవంబర్ లో టోకు ద్రవ్యోల్బణం 4.64% ఉంది. డిసెంబర్ లో జారీ చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్ లో ఆహార పదార్థాలలో 0.07% ద్రవ్యోల్బణం తగ్గింది. కూరగాయలు డిసెంబర్ లో 17.55%గా ఉండగా నవంబర్ లో 26.98% ఉన్నాయి.