శేరిలింగంపల్లిలో ఇండిపెండెంట్ గా పోటీచేస్తా

 శేరిలింగంపల్లిలో ఇండిపెండెంట్ గా పోటీచేస్తా

శేరిలింగంపల్లి నియోజకవర్గ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గుర్రుగా ఉన్నారు. మసీదు బండాలోని తన నివాసంలో ఈరోజు అనుచరులతో సమావేశమయ్యారు. గతంలో రాహుల్‌గాంధీ బహిరంగ సభకు తానెంతో కృషి చేశానని గుర్తుచేసుకున్నారు. శేరిలింగంపల్లి టికెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించుకోవాలని కోరారు. ఆ స్థానం తనకు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. తాను ఇప్పటికే అధిష్టానం సూచన మేరకు నెల రోజులుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నానని తెలిపారు.