రాజశేఖర్ వేసింది పవన్‌కు కౌంటర్ కాదు

రాజశేఖర్ వేసింది పవన్‌కు కౌంటర్ కాదు

హీరో రాజశేఖర్ నటించిన కొత్త చిత్రం 'కల్కి' ట్రైలర్ నిన్ననే విడుదలైంది.  కమర్షియల్ ట్రైలర్ పేరుతొ విడుదలైన ఇందులో కంటెంట్ కొంచెం గమ్మత్తుగా ఉంది.  రాజశేఖర్ ఎన్నడూ చేయని కొన్ని పనులు చేశారు.  అయితే ట్రైలర్ ఓపెనింగ్ షాట్లో పవన్ 'గబ్బర్ సింగ్' సినిమాలో చెప్పిన ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి అనే డైలాగును అలాగే చెప్తారు రాజశేఖర్.  అది బాగానే కనెక్ట్ అయింది.  కానీ కొందరు మాత్రం అది పవన్‌కు రాజశేఖర్ వేసిన కౌంటర్ అని ప్రచారం స్టార్ట్ చేశారు.  కానీ ట్రైలర్ చివర్లో రాజశేఖర్ ఏకంగా తన ట్రేడ్ మార్క్ డాన్సును తానే వెటకారంగా ఇమిటేట్ చేశారు.  దీన్నిబట్టి అవి కేవలం ఫన్ కోసం తప్ప ఎవరికీ కౌంటర్స్ వేయడానికి కాదని అర్థమవుతోంది.