కూల్‌ప్యాడ్ మెగా 5ఎ విడుదల

కూల్‌ప్యాడ్ మెగా 5ఎ విడుదల

మొబైల్స్ తయారీ సంస్థ 'కూల్‌ప్యాడ్' తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కూల్‌ప్యాడ్ మెగా 5ఎ'ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గురువారం నుండి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.6,999 లుగా ఉంది.ఈ ఫోన్ ఆన్ లైన్ లో మాత్రం లభించదు. ఇండియాలో 8 రాష్ట్రాల్లో ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఢిల్లీ, హర్యాన, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఉత్తర ప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో అందుబాటులో ఉంది. ఫ్రంట్ కెమెరాకు ఫేస్ అన్‌లాక్, మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ ఉన్నాయి.

ఫీచర్లు:

# 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
# 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
# 2 జీబీ ర్యామ్.. 16 జీబీ స్టోరేజ్( 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
#  2500 ఎంఏహెచ్ బ్యాటరీ
# డ్యుయల్ సిమ్
# 8, 0.3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు.. 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
#  4జీ వీవోఎల్‌టీఈ