కారు విలువ లక్ష.. చలానా 96 వేలు..!

కారు విలువ లక్ష.. చలానా 96 వేలు..!

ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ మీదుగా ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్న ఓ కారును ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి కాస్త కంగారు పడ్డాడు. పోలీసులకు అనుమానం వచ్చి ఆ కారుపై పెండింగ్‌లో ఉన్న చలానాలను ఆన్‌లైన్‌లో చెక్‌ చేశారు. మొత్తం 78 చలానాలు పెండింగ్‌లో ఉండడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. బకాయి ఉన్న రూ.96,830 చెల్లించకపోతే కారును సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. చేసేది లేక ఆ మొత్తాన్ని చెల్లించేయడంతో కారును విడిచిపెట్టారు. ఒకే కారు మీద ఇన్ని చలానాలు పెండింగ్ లో ఉండటం పోలీసులకు ఆశ్చర్యానికి గురి చేసింది. మరో విషయమేంటంటే.. ఈ కారు విలువ కాస్త అటుఇటుగా రూ.లక్ష ఉంటుందట.