దిగ్విజయ్ ర్యాలీలో కాషాయం స్కార్ఫ్‌లు

దిగ్విజయ్ ర్యాలీలో కాషాయం స్కార్ఫ్‌లు

 కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ లోక్‌సభ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ బుధవారంనాడు చేపట్టిన రోడ్‌షోలో కాషాయం స్కార్వ్స్‌లు అందరిని ఆకర్షించాయి. దిగ్విజయ్ ర్యాలీలో పాల్గొనగా, భద్రత కోసం మోహరించిన కొందరు పోలీసు సిబ్బంది కాషాయం స్కార్వ్స్‌తో కనిపించారు. తాము, నిర్వాహకులు కలిసి వాలంటీర్ల పేర్లను నమోదు చేశామని, అయితే వాలంటీర్లు ధరించిన వాటిపై తాము అభ్యంతరం చెప్పలేదని, పోలీసు సిబ్బంది మాత్రం ఎలాంటి రంగు స్క్రార్వ్స్‌ ధరించలేదని భోపాల్ డీఐజీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని పలువురు సాధువులు దిగ్విజయ్‌కు మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఓల్డ్ భోపాల్‌లోని పీర్ గేట్ నుంచి శాంకరి లేన్స్ వరకూ రోడ్‌షో జరిగింది. ఈ గ్రూప్‌కు నామ్‌దేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా నాయకత్వం వహించారు. మే 12న జరిగే ఎన్నికల్లో దిగ్విజయ్ విజయం కోరుతూ దేశవ్యాప్తంగా సాధువులు ఇందులో పాల్గొన్నట్టు కంప్యూటర్ బాబా తెలిపారు.