షాకిస్తున్న కరోనా: నెగెటివ్ కేసుల్లో కరోనా యాంటీబాడీస్... 

షాకిస్తున్న కరోనా: నెగెటివ్ కేసుల్లో కరోనా యాంటీబాడీస్... 

కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన కేసుల గురించి ఇప్పటి వరకు చూశాం.  అయితే, కరోనా పాజిటివ్ లేని వారిలో కరోనా యాంటి బాడీస్ కనిపిస్తుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది.  ఇటీవలే ఓ 60 ఏళ్ల వ్యక్తి ముంబైలోని నవీ ముంబై ఆసుపత్రికి వెళ్ళాడు.  కరోనా పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చినా... శరీరంలో కరోనా యాంటీ బాడీస్ కనిపించడంతో యాంటి బాడీస్ టెస్ట్ చేశారు.  శరీరంలో యాంటి బాడీస్ డెవలప్ కావడంతో పోస్ట్ కోవిడ్ కేసుగా తేల్చారు.  

చాలా మందికి తెలియకుండానే కరోనా వైరస్ వచ్చిపోతుందని, ఇప్పటికే అనేక మందికి ఇలా జరిగినట్టు వైద్యులు చెప్తున్న సంగతి తెలిసిందే.  అయితే, కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత, వైరస్ తో ఫైట్ చేసే యాంటి బాడీస్ డెవలప్ అవుతాయి.  యాంటీ బాడీస్ ఎప్పుడైతే తగ్గిపోతాయో తిరిగి అప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఫలితంగా శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటాయని, ఇలాంటి కేసులే పోస్ట్ కోవిడ్ కేసులుగా మారుతున్నాయని వైద్యులు చెప్తున్నారు.  ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువౌతున్నట్టు వైద్యులు చెప్తున్నారు.  జలుబు, జ్వరం వంటివి వచ్చి తగ్గిపోయిన తరువాత తగ్గిందిలే అని నిర్లక్ష్యం చెయ్యొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

"శ్వాస తీసుకోవడంలో కష్టం, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులతో వచ్చిన వారిని ఆరా తీశామని, ప్రతి ఒక్కరు రెండు లేదా మూడు నెలల క్రితం జ్వరం లేదా దగ్గుతో ఇబ్బంది పడినట్లు తెలిపారని ముంబైలోని అపోలో ఆసుపత్రిలోని పుల్మొనాలజిస్ట్ డాక్టర్ జయలక్ష్మి  చెప్పారు. అయితే ఆర్‌టీపీసీఆర్ నెగిటివ్ రావడంలో ఆశ్యర్యం లేదని, కానీ కరోనా లక్షణాలను సీటీ స్కాన్ ద్వారా గుర్తించామని ఆమె చెప్పారు. అంతేకాకుండా యన్టీబాడీ పరీక్షలో కూడా వారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.