నటుడు,డిఎండికె అధ్యక్షుడు విజయ్ కాంత్ కు కరోనా..!

   నటుడు,డిఎండికె అధ్యక్షుడు విజయ్ కాంత్ కు కరోనా..!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. సాధారణ ప్రజలతోపాటు అధికారులు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. కాగా తాజాగా తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. గత కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతుండగా, తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన చికిత్స నిమిత్తం చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల విజయ్ కాంత్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ ఆయన కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా విజయ్ కాంత్ అభిమానులు పూజలు చేస్తున్నారు.