ఒక్కరోజులో 6 లక్షల కేసులు... 10వేలకు పైగా మరణాలు 

ఒక్కరోజులో 6 లక్షల కేసులు... 10వేలకు పైగా మరణాలు 

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది.  ఇప్పటికే లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు.  కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  కరోనాకు మొదటి టీకాను రిలీజ్ చేసిన రష్యాలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.  ఇక ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసిన రష్యాలో సైతం కేసులు విజృంభిస్తున్నాయి.  అమెరికాలో నిన్న ఒక్కరోజులో 2,05,232మందికి కరోనా సోకింది.  2,234 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.  ఇక ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే నిన్న ఒక్కరోజు 6,17,177 కరోనా కేసులు నమోదు కాగా, 10,071 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.  గతంలో కంటే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య బాగా పెరిగిపోతున్నది.  అటు మరణాల సంఖ్య కూడా పెరిగింది.  కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయకుంటే మరింత ఉదృతంగా మారే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.