కరోనా ఎఫెక్ట్: సెకండ్ హ్యాండ్ కార్లకు పెరిగిన భారీ డిమాండ్ 

కరోనా ఎఫెక్ట్: సెకండ్ హ్యాండ్ కార్లకు పెరిగిన భారీ డిమాండ్ 

కరోనా కాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించడానికి ప్రజలు భయపడుతున్నారు. బయటకు ఎక్కడికి వెళ్ళాలి అన్నా సాధ్యమైనంత వరకు సొంత వాహనాలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఉన్నత తరగతికి చెందిన వ్యక్తులు మాత్రమే కార్లు వినియోగించేవారు.  కానీ, ఇప్పుడు మధ్యతరగతికి చెందిన వ్యక్తులు కూడా కార్లు వినియోగిస్తున్నారు.  కొత్త కార్లు కొనుగోలు చేయాలంటే లక్షల్లో ఉంటాయి.  అదే సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.  సొంతవాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది.  ఈ వాహనాలు రూ. 70వేల నుంచి దొరుకుండటంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు.  దీంతో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.