కరోనా ఎఫెక్ట్: 54వేలమందిని వదిలేసిన ఇరాన్...!!

కరోనా ఎఫెక్ట్: 54వేలమందిని వదిలేసిన ఇరాన్...!!

ప్రపంచంలో కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉన్నదో చెప్పక్కర్లేదు.  కరోనా ప్రభావం 70కి పైగా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.  3000 మందికి పైగా మరణించారు. 80వేలమంది వరకు దీని బారిన పడ్డారు.  చైనా, దక్షిణ కొరియా, ఇటలీ తరువాత అత్యధిక ఎఫెక్ట్ ఉన్న దేశం ఇరాన్.  గల్ఫ్ దేశమైన ఇరాన్ లో ఈ ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది.  సామాన్య ప్రజలతో పాటుగా అధికారులు, మంత్రులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు.  

290 మంది ఎంపీలలో 23 మంది ఎంపీలకు కరోనా సోకింది.  దీంతో ఆ దేశం హైఅలర్ట్ ను ప్రకటించింది.  దేశంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దని హెచ్చరికలు జారీ చేసింది.  దేశంలోని జైళ్లపై కూడా ఇరాన్ దృష్టి సారించింది.  జైళ్లలో 54 వేలమంది ఖైదీలు ఉన్నారు.  కరోనా ఖైదీలకు వ్యాపిస్తే జరిగే అనర్ధం ఏంటో అందరికి తెలుసు.  అందుకే కరోనా వ్యాపించకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.  జైల్లో ఉన్న ఖైదీలను రిలీజ్ చేస్తున్నారు.  బయటకు పంపేసమయంలో వారికి టెస్టులు చేసి పంపిస్తున్నారు.  అయితే కరుడుకట్టిన ఖైదీలను మాత్రం జైల్లోనే ప్రత్యేకంగా ఉంచుతున్నారు.