ఏపీలో కరోనా హై అలర్ట్

ఏపీలో కరోనా హై అలర్ట్

ఏపీలో కరోనా పాజిటీవ్ కేసులు 87కు చేరుకోవడంతో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. కోవిడ్-19పై ఉన్నత స్థాయి సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టారు. ఈ సమావేశానికి డెప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి లాంటి వారు హాజరయ్యారు. కోవిడ్ పాజిటివ్ కేసులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేయనున్నారు. ఆస్పత్రుల్లో కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన బెడ్స్, వైద్య సదుపాయాలు, లాబ్ టెస్టింగ్ రిపోర్టులపై చర్చ జరుగుతున్నట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరు, రేషన్ సరఫరా, సామాజిక దూరం విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు చెబుతున్నారు. రెండో విడత ఇంటింటి సర్వేపై మీద కూడా ఆయన సమీక్షించనున్నట్టు చెబుతున్నారు.