రోడ్డెక్కిన కరోనా పేషంట్లు !

రోడ్డెక్కిన కరోనా పేషంట్లు !

నెల్లూరు జిల్లా గూడూరు గాంధీనగర్లో ఉన్న కోవిడ్19  క్వారెంటైన్ సెంటర్ లో కరోన పేషెంట్లు రోడ్డు ఎక్కారు. క్వారెంటైన్లో ఉన్న కరోన బాధితులకు మూడు రోజులుగా భోజనం మందులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. అధికారులు డాక్టర్లు పట్టించుకోవడం లేదు అంటూ ఆందోళనకు దిగారు. మమ్మల్ని ఇక్కడి నుండి ఇంటికి పంపించాలి అంటు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు కరోనా బాధితులు. ఆసుపత్రి వర్గాలు పై అధికారులకి సమాచారం అందించారు. ఇక నిన్న గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా నేడు 85 పోసిటివ్  కేసులు నమోదయ్యాయి. గూడూరు టౌన్, రూరల్ లో 33 కేసులు నమోదు కాగా, చిల్లకూరు మండలంలో 22 కేసులు నమోదయ్యాయిని సమాచారం. కోట మండలంలో 26 కేసులు నమోదయ్యాయి. వాకాడు మండలంలో 2 కేసులు, చిట్టమూరు మండలంలో 2 కేసులు నమోదయ్యాయి.