ఈ బస్సు ఎక్కిన ప్రయాణికులు జాగ్రత్త..!

ఈ బస్సు ఎక్కిన ప్రయాణికులు జాగ్రత్త..!

లాక్ డౌన్ తరవాత దేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా రవాణాను కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఆర్టీసీ సేవలను సైతం ప్రారంభించారు. అయినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ముందు నుండి మొత్తుకుంటుంది. కరోనా వచ్చిన ప్రయాణికులు, అనుమానితులు బయటకు రాకూడదని సూచించింది. కానీ కొంతమంది చేసే పనుల వల్ల వైరస్ వ్యాప్తి ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ అని తేలిన ముగ్గురు వ్యక్తులు ఆదిలాబాద్ కు బస్సులో ప్రయాణించారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు  'టీఎస్ 08 జడ్ 0229' సర్వీసులో వీరు వెళ్లారు. బస్సు బయలుదేరే ముందు వీరు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్స్ లో పాజిటివ్ వచ్చినప్పటికీ హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుండి బస్సులో బయలుదేరి రాత్రి 10:30 గంటలకు ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆదిలాబాద్ చేరుకున్న తరవాత నేరుగా రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి తాము కరోనా రోగులమని చికిత్స చేయాలని కోరారు. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.