భారత్-ఆసీస్ సిరీస్... ఆ విషయాలు మనకు తెలియవు

భారత్-ఆసీస్ సిరీస్... ఆ విషయాలు మనకు తెలియవు

కరోనా మహమ్మారి కారణంగా భారతదేశ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) తోసిపుచ్చలేదు. అయితే షెడ్యూల్ ప్రకారం భారతదేశం వరుసగా బ్రిస్బేన్ (డిసెంబర్ 3-7), అడిలైడ్ (డిసెంబర్ 11-15), మెల్బోర్న్ (డిసెంబర్ 26-30), సిడ్నీ (జనవరి 3-7) లలో టెస్టులు ఆడనున్నట్లు సిఎ ప్రకటించింది. అయితే, ఆరోగ్య సంక్షోభం కారణంగా ప్రయాణ పరిమితులను బట్టి షెడ్యూల్ మారవచ్చని ఆ విషయాలు మనకు ముందే తెలియవని సిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపారు. షెడ్యూల్ సమయానికి సరిహద్దులు, దేశీయ ప్రయాణానికి తెరుచుకుంటాయని సిఎ భావిస్తుంది. అయితే సమయం వచ్చినప్పుడు మనం ఒకటి లేదా రెండు వేదికలను మాత్రమే ఉపయోగించాల్సి ఉటుందని, మనకు ఆ విషయం గురించి ఇంకా ఏదీ తెలియదు" అని చెప్పారు. అయితే చూడాలి మరి భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ అసలు జరుగుతుందా... లేదా అనేది.