సముద్రం దగ్గరకి వెళ్తే... అది గిఫ్టులు తెచ్చిస్తోంది... ఎందుకో తెలుసా? 

సముద్రం దగ్గరకి వెళ్తే... అది గిఫ్టులు తెచ్చిస్తోంది... ఎందుకో తెలుసా? 

సముద్రాల్లో నివసించే డాల్ఫీన్లకు తర్ఫీదు ఇస్తే అవి మనుషులు చెప్పినట్టు వింటాయి.  మనుషులకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటాయి. డాల్ఫీన్లకు తర్ఫీదులు ఇచ్చే సెంటర్లు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్న సంగతి తెలిసిందే.  ఇలాంటిదే ఒకటి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ లోని కులూలూలో ఉన్నది.  ఇక్కడ కాన్ బే అనే డాల్ఫీన్ తర్ఫీదు కేంద్రం ఉన్నది.  అందులో డాల్ఫీన్లకు తర్ఫీదు ఇవ్వడంతో పాటుగా ఫీడింగ్ ఇస్తుంటారు. రోజు వందలాది మంది అక్కడి వచ్చి డాల్ఫీన్లను చూసి వాటికి చేపలు వంటివి ఫీడింగ్ ఇస్తుంటారు.  

అయితే, కరోనా కారణంగా రెండు నెలల పాటు మనుషులు ఎవరూ కూడా ఆ ప్రదేశం వైపు వెళ్ళలేదు.  ఆస్ట్రేలియాలో కరోనా అదుపులోకి వచ్చిన తరువాత తిరిగి కాన్ బే ను తెరిచారు.  దీంతో ఇప్పుడు మరలా ప్రజలు వస్తున్నారు.  ప్రజలు వాటిని చూసేందుకు వస్తున్న నేపథ్యంలో అందులోని మిస్టిక్ అనే 29 ఏళ్ల వయసు కలిగిన మగ డాల్ఫీన్ వచ్చిన వాళ్ళ కోసం సముద్రం అడుగుకు వెళ్లి రకరకాల గిఫ్ట్ లను పట్టుకొచ్చి ఇస్తోంది.  సముద్రపు నాచు, ఆల్చిప్పలు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తోంది.  ఇలా గిఫ్ట్ లు అందుకున్న వ్యక్తులు ఆ డాల్ఫీన్ కు థాంక్స్ చెప్పడంతో పాటుగా చేపను రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తున్నారు.  డాల్ఫీన్ ఇచ్చిన గిఫ్ట్ లను జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు.  ఆ కాన్ బే సెంటర్ లో 7 డాల్ఫీన్లు ఉన్నాయని, అందులో మిస్టిక్ అనే డాల్ఫీన్ ఒక్కటే ఇలా మనుషుల మనస్తత్వానికి దగ్గరగా ఉంటూ గిఫ్ట్ లు తెచ్చి ఇస్తోందని అంటున్నారు.