ఏపీలో నిండుకున్న కరోనా వ్యాక్సిన్ నిల్వలు... ఈ సాయంత్రానికి... 

ఏపీలో నిండుకున్న కరోనా వ్యాక్సిన్ నిల్వలు... ఈ సాయంత్రానికి... 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.  మొదట్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపని ప్రజలు, కేసులు పెరుగుతున్న సమయంలో వ్యాక్సినేషన్ కోసం క్యూలు కడుతున్నారు.  పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సినేషన్ సెంటర్లకు వస్తుండటంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.  ఈరోజు నుంచి టీకా ఉత్సవ్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జరీ చేయడంతో రోజుకు 6 లక్షల టీకాలు వేయాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.  కానీ, తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా జిల్లాల్లో ఈ కార్యక్రమాని వాయిదా వేస్తున్నారు.  విశాఖలో ప్రస్తుతానికి 500 టీకాలు మాత్రమే అందుబాటులో ఉండగా అత్యధికంగా కృష్ణాజిల్లాలో 32 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అన్ని జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టె అవకాశం ఉన్నట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.