కరోనా దెబ్బ మాములుగా లేదు... ఒక్కరోజులోనే మూడు లక్షల కోట్లు ఆవిరి... 

కరోనా దెబ్బ మాములుగా లేదు... ఒక్కరోజులోనే మూడు లక్షల కోట్లు ఆవిరి... 

కరోనా ప్రభావం చైనాలో మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతున్నట్టుగానే కనిపిస్తోంది.  చైనాలో ఈ వైరస్ కారణంగా దాదాపుగా 2500 మందికి పైగా మరణించారు.  అంతేకాదు 80 వేలమందికి ఈ వైరస్ సోకింది.  అయితే, గత నాలుగైదు రోజులుగా ఈ వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.  కేసులు మెల్లిగా తగ్గుతుండటంతో చైనా ఊపిరి పీల్చుకుంటోంది. 

అయితే, ఈ కరోనా ఇప్పుడు చైనా వెలుపల తన ప్రభావం చూపిస్తోంది.  దక్షిణ కొరియాలో 350 మందికి పైగా ఈ వైరస్ సోకింది.  కొరియాలో చలి గాలులు వీస్తుండటమే ఇందుకు కారణం కావొచ్చు.  నమోదవుతున్న కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఆ దేశం ఆందోళన చెందుతున్నది.  దక్షిణ కొరియాతో పాటుగా అటు యూరప్ దేశమైన ఇటలీలో కూడా దీని ప్రభావం అధికంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 70 మంది వరకు దీని బారిన పడ్డారు.  ఇటలీలో కరోనా వలన ఓ వ్యక్తి మరణించడంతో ఆ దేశం అప్రమత్తం అయ్యింది.  ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటోంది.  యూరప్ లో ప్రస్తుతం చలికాలం కావడంతో వైరస్ వ్యాపించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.  చైనా వెలుపల ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపించింది.  ఒక్క రోజులోనే మూడు లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోయింది.  దీని ప్రభావం మరింత ఎక్కువైతే మార్కెట్లు మరింతగా పడిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.