దాని దెబ్బకు 56 కాదు... 6.5 కోట్ల మంది  మరణిస్తారట... 

దాని దెబ్బకు 56 కాదు... 6.5 కోట్ల మంది  మరణిస్తారట... 

ప్రపంచాన్ని ఇప్పుడు భయపెడుతున్న ముఖ్యమైన వాటిల్లో ఒకటి కరోనా వైరస్.  ఈ వైరస్ దెబ్బకు చైనా బెంబేలెత్తుతోంది.  వుహాన్ నగరంలో ఈ వైరస్ మొదట ఈ వైరస్ ను కనుగొన్నారు.  పాములు,గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తున్నట్టు తెలుసుకున్నారు.  అయితే, ఈ వైరస్ చైనాలోని అనేక నగరాలకు వ్యాప్తినిచ్చింది.  దాదాపుగా 2000 మందికి పైగా ఈ వైరస్ బారిన పడినట్టు చైనా ఆరోగ్య సంస్థలు చెప్తున్నాయి.  56 మంది ఇప్పటికే మరణించారు.  

అయితే, గత అక్టోబర్ నుంచి ఈ వైరస్ ప్రపంచంలోని 11 దేశాలకు వ్యాప్తి చెందిందని, ఈ వైరస్ కారణంగా రాబోయే రోజుల్లో 6.5 కోట్ల మంది మరణించే అవకాశం ఉన్నట్టుగా జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీ హెచ్చరించింది.  దీంతో ప్రపంచంలోని వివిధ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.  ఆ సంస్థ హెచ్చరించిన ఈ స్థాయిలో మరణాలు ఉంటె మాత్రం దాని వలన ప్రపంచం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.