కరోనా నయం అయ్యాక.. రోగి శరీరంలో ఈ వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

కరోనా నయం అయ్యాక.. రోగి శరీరంలో ఈ వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

కరోనా ఒక సాధారణ స్థాయి నుంచి భయానకం కలిగించే మహమ్మరిగా మారిన సంగతి తెలిసిందే.  కరోనా బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది.  663168 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.  30,855 మరణాలు సంభవించాయి.  దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  వైరస్ నుంచి కొలుకుంటున్నా ఎందుకో వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. జనవరి 28 వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వరకు బీజేయినగ లోని పీఎల్ఏ జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన రోగుల పై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.  కరోనా నుంచి కొలుకొని బయటకు వెళ్ళినా, వారితో కాంటాక్ట్ అవుతున్న వ్యక్తులకు కరోనా సోకుతుండటంతో ఈ దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు.  

రోగి కొలుకొని డిశ్చార్జ్ అయినప్పటికీ ప్రాధమికంగా అతని శరీరంలో వైరస్ పూర్తిగా అంతరించిపోవడం లేదని, అతని శరీరంలో దాదాపుగా 8 రోజులపాటు వైరస్ ఉంటుందని, తద్వారా కొత్త వ్యక్తులకు కరోనా సోకుటుందని దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన లోకేష్ శర్మ పేర్కొన్నారు.  కరోనా వైరస్ నుంచి కొలుకున్నాక కూడా రోగిని రెండు వారాలపాటు పరిశీలనలో ఉంచాలని  లేదంటే అతని ద్వారా మరికొన్ని కొత్త కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు లోకేష్ శర్మ.  ఈ దిశగా చేసిన పరిశోధనలు ఇప్పుడు కొన్ని భయాలను కలిగిస్తున్నాయి.