కరోనా ఎఫెక్ట్.. జాయింట్ కలెక్టర్ మారు వేషంలో...

కరోనా ఎఫెక్ట్.. జాయింట్ కలెక్టర్  మారు వేషంలో...

కరోనా ఎఫెక్ట్ తో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి అనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెంచేశారు అని కొన్ని ప్రాంతాల నుంచి సమాచారం రావడంతో సీరియస్ గా తీసుకున్న సర్కార్.. కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇదే సమయంలో విజయనగరం జాయింట్ కలెక్టర్ కి భలే ఐడియా వచ్చింది... మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తిరుగుతూ... ధరలపై ఆరా తీశారు. కరోనా విస్తరణ.. లాక్‌డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల పెంచారన్న సమాచారంతో.. ధరలను నిర్ణయించింది ఏపీ సర్కార్.. అయితే జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్.. దీనిపై దృష్టి సారించారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.. ఇక ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అధికారులతో సమావేశం నిర్వహించి.. ఆదేశాలు ఇచ్చారు. ఇది అంతా బాగానే వున్నా జాయింట్ కలెక్టర్ మారువేషంలో రావడంతో వ్యాపారుల్లో దడ మొదలైంది.