వైష్ణోదేవి ఆలయంపై కరోనా ఎఫెక్ట్ ... 

వైష్ణోదేవి ఆలయంపై కరోనా ఎఫెక్ట్ ... 

కరోనా ప్రభావం దేశంలోని ప్రజలమీదనే కాకుండా ఆలయాలపై కూడా పడింది. సమ్మర్ సమయంలో వైష్ణోదేవి మాత ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఎండాకాలం మొదలైన సమయంలో ఎక్కువమంది చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్లిపోతుంటారు.  ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కు ఎక్కువ మంది వెళ్తుంటారు.  జమ్మూ కాశ్మీర్ కు వెళ్లే వ్యక్తులు వైష్ణోదేవి ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకుంటారు. 

ఈ సమయంలోనే వైష్ణోమాత ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.  అయితే, ఇప్పుడు వైరస్ ఎఫెక్ట్ వైష్ణోమాత ఆలయంపై పడింది. దేశంలో వైరస్ ప్రభావం పెరుగుతున్న సందర్భంగా వైష్ణోమాత యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  అంతేకాదు అంతరాష్ట్ర బస్ సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్టు సమాచారశాఖ ప్రకటించింది.