లాక్‌డౌన్... నష్టం ఎంతో తెలుసా?

లాక్‌డౌన్... నష్టం ఎంతో తెలుసా?

కరోనా నియంత్రణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్... 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు ప్రధాని నరేంద్ర మోడీ... దీంతో మరో 21 రోజుల పాటు అస్త్యవసర సేవలు మినహా ఏమి పనిచేయవు... అంటే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. అయితే దీని నష్టం ఎంత? అనే అనుమానాలు లేకపోలేదు. దీనిపై  ఆర్థిక నిపుణులు ఓ అంచనాకి వచ్చారు. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల సుమారు 120 బిలియ‌న్ల డాల‌ర్లు అంటే 9 ల‌క్ష‌ల కోట్ల మేర ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే అవ‌కాశాలు వున్నాయి అని చెబుతున్నారు. ఇది జీడీపీలో 4 శాతం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించాల‌ని కూడా వారు కోరుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన ఆర్బీఐ విధాన‌స‌మీక్ష రిపోర్ట్‌ను వెల్ల‌డించ‌నున్న‌ది. అప్పుడు భారీగా కోత‌లు ఉంటాయ‌న్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి.  మూడు వారాల లాక్‌డౌన్ వ‌ల్ల బ్రిటీష్ బ్రోక‌రేజ్ బార్క్‌లేస్ సంస్థ వృద్ధి రేటును స‌వ‌రించింది.  3.5 శాతం నుంచి వృద్ధి రేటు 1.7 శాతానికి ప‌డిపోనున్న‌ట్లు చెబుతోంది. అంటే లాక్ డౌన్ ఈ 21 రోజులు కొనసాగితేనే ఈ పరిస్థితి.. మరి అప్పటి వరకు పరిస్థితులు సర్దుకుపోతాయా..? ఇంకా తీవ్రం అవుతుందా ? అనే ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి.