ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం కార్పొరేషన్..!

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం కార్పొరేషన్..!

ఔట్‌సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థ కట్టడికి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది.. ఔవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో భర్తీ చేయాలని.. ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా 50శాతం ఉద్యోగాలు మహిళలకు ఇవ్వాలని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి.. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వం, ఎక్స్‌అఫీషియోగా కలెక్టర్‌ ఉండనున్నారు. సాధారణ పరిపాలనా శాఖ నేతృత్వంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారు. అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే పనికి ఒకేరకమైన జీతం.. ఆన్‌లైన్‌ పద్ధతుల్లో జీతాల చెల్లింపు, పోర్టల్‌ద్వారా నియామకాలు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్‌ 1 నుంచి కార్పొరేషన్‌ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేయనుండగా.. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌కి వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.