అవినీతికి పాల్పడ్డ సీఐ సస్పెన్షన్

అవినీతికి పాల్పడ్డ సీఐ సస్పెన్షన్

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సీఐ నర్సింహారెడ్డి సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు మఠంపల్లిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ బలరాంరెడ్డి, కానిస్టేబుల్ కమలాకర్‌తోపాటు గరిడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. హుజూర్‌నగర్ సర్కిల్ పరిధిలో పెద్ద ఎత్తున గుట్కాలు, పీడీఎస్ బియ్యం అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. ఈ దందాలో సీఐతో పాటు ఆయా మండలాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గుట్టుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఈ అక్రమ దందాలో కీలక పాత్ర పోషించే పెద్ద వ్యాపారులతో జతకట్టి వారిపై ఎలాంటి తనిఖీలు చేయకుండా చిరు వ్యాపారులను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నట్లు తేలింది. నెలనెలా మామూళ్ల కోసం సర్కిల్ పరిధిలోని స్టేషన్‌లలో కొంతమంది సిబ్బందిని పెట్టుకున్నట్లు ఈ విచారణలో తేలింది.