కస్టమర్ చేసిన పనికి షోరూం సిబ్బంది షాక్

కస్టమర్ చేసిన పనికి షోరూం సిబ్బంది షాక్

ఓ మహిళా కస్టమర్ చేసిన పనికి కారు షోరూం సిబ్బంది తలలు పట్టుకున్నారు. కారు కొనడానికి ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చిన చిల్లరను లెక్కపెట్టడానికి 17 మంది సిబ్బందికి మూడు రోజులు పట్టింది. వివరాల్లోకి వెళితే... చైనాలోని కాన్‌జౌవ్ కు చెందిన ఓ మహిళ ఫోక్స్ వాగన్ కారును కొనేందుకు చాలా కాలం నుంచి డబ్బును దాచిపెడుతూ వస్తోంది. 10 సంవత్సరాలుగా దాచిన ఆ సొమ్మును తీసుకుని కారు షోరూంకు వచ్చింది. కారును ఎంచుకున్న తరువాత తన వద్ద 66 సంచుల్లో ఉన్న చిల్లరను ఇచ్చింది. దీంతో కారు షోరూం సిబ్బంది ఖంగుతిన్నారు. ఈ చిల్లర మొత్తం లెక్కించేసరికి సిబ్బంది చేతులు నల్లగా మారిపోయాయి. చిల్లర లెక్కిస్తున్న దృశ్యాలను వీడియో తీసిన సిబ్బంది దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.