కౌంటింగ్‌ ప్రారంభం...

కౌంటింగ్‌ ప్రారంభం...

ఆంధ్రప్రదేశ్‌లో 17 లోక్ సభ నియోజకవర్గాలలో  కౌంటింగ్‌ మొదలైంది. 305 కౌంటింగ్ కేంద్రాలలో  పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓటింగ్‌ కేంద్రాల్లో తమ పార్టీ తరఫున పర్యవేక్షకులుగా సీనియర్‌ నేతలను రాజకీయ పార్టీలు పంపాయి. ఈవీఎంలపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తిగా తెలిసివారికి ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు టీడీపీ, వైకాపా ప్రధాన కార్యాలయాల్లో హడావుడి అధికంగా ఉంది. జగన్‌ తన నివాసంలోనే ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్నారు.