అమేథీలో నిలిచిపోయిన కౌంటింగ్..

అమేథీలో నిలిచిపోయిన కౌంటింగ్..

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ లోక్‌సభ స్థానంలో కౌంటింగ్ నిలిచిపోయింది. సర్వర్ ఫెయిల్యూర్ కారణంగా కౌంటింగ్‌ నిలిపివేశారు అధికారులు. కాగా, రాహుల్ గాంధీ 2004 నుంచి ఇదే స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు రాహుల్ గాంధీ. అయితే, 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ.. రాహుల్‌పనై బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో రాహుల్‌కు 4,08,651 ఓట్లు రాగా, ఆయనపై పోటీచేసిన స్మృతి ఏకంగా 3,00,748 ఓట్లను దక్కించుకున్నారు. దీంతో ఈ సారి ఈ నియోజకవర్గం ఎన్నికలపై ఫోకస్ ఎక్కువగా ఉంది.