డ్రగ్స్ విక్రయిస్తూ దొరిపోయిన భార్యభర్తలు

డ్రగ్స్ విక్రయిస్తూ దొరిపోయిన భార్యభర్తలు

డ్రగ్స్ విక్రయిస్తున్న భార్యభర్తలను ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌ రోడ్‌ నెంబర్‌-5లో ఓ ఇంట్లో షేక్‌ ఫహద్‌ అలియాస్‌ మదన్, అతని భార్య సలీమా రబ్బాయిషేక్ లు గత కొంతకాలంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ నెల 2వ తేదీన ఈ ఇంటిపై దాడి చేసి ఏడు గ్రాముల కొకైన్‌తో పాటు మూడు గ్రాముల ఓపీఎం, ద్విచక్రవాహనాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న బి.సంతోష్, మహ్మద్‌ మసూద్‌లను అరెస్ట్‌ చేసి విచారించగా వీరికి షేక్‌ ఫహద్, సలీమా ఇద్దరూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో పలువురు ప్రముఖులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు .