బైక్ పై రొమాన్స్, వైరల్ వీడియో

బైక్ పై రొమాన్స్, వైరల్ వీడియో

1998 సంవత్సరంలో విడుదలైన బాలీవుడ్ హిట్ మూవీ గులామ్ గుర్తుందా. అమీర్ ఖాన్, రాణిముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రంలోని 'జాదూ హై తేరా హీ జాదూ' పాటను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి! పాట మొత్తం రొమాంటిక్‌గా సాగుతుంది. రాణి ముఖర్జీని అమీర్ ఖాన్ తన బైక్‌పై ముందు కూర్చోబెట్టుకొని రైడింగ్ చేసే సీన్ అద్భుతం. మరి ఆ సినిమాలోని సీన్ బాగా నచ్చిందో ఏమిటో తెలియదు గానీ, అలాంటి స్టంట్ ను ఢిల్లీకి చెందిన ఓ జంట చేసింది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ రహదారిపై ఈ స్టంట్‌ను చేస్తూ ఆ జంట ఎంజాయ్ చేసింది. అది కూడా ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో ఈ జంట చేసిన విన్యాసాన్ని ఓ ఐపీఎస్ అధికారి తన కెమెరాలో బంధించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. మోటార్ వెహికల్ చట్టంలో కొన్ని కొత్త సెక్షన్‌లు తప్పనిసరి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.