చిదంబరానికి ఊరటనిచ్చిన కోర్టు

చిదంబరానికి ఊరటనిచ్చిన కోర్టు

ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి పెద్ద ఊరట లభించింది. ఆగస్ట్ 7 వరకు సీబీఐ ఆయనపై ఎలాంటి చర్య తీసుకోరాదని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశించింది. ఇటీవలే ఎయిర్ సెల్‌-మ్యాక్సిస్ కేసులో చిదంబరం నిందితుడని సీబీఐ అనుబంధ చార్జిషీటులో పేర్కొంది. దీంతో తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనను అదుపులోకి తీసుకొనేందుకు అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.