సిద్దిపేట కొండపాక హై స్కూల్‌లో కరోనా కలకలం..!

సిద్దిపేట కొండపాక హై స్కూల్‌లో కరోనా కలకలం..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతున్నాయి.. తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు అప్పడప్పుడు పెరుగూతనే ఉన్నాయి.. తాజాగా.. సిద్దిపేట జిల్లా కొండపాక జెడ్పీహెచ్‌ఎస్‌లో కరోనా కలకలం సృష్టించింది.. ఆ స్కూల్‌లో పనిచేసే ఓ ఉపాధ్యాయునికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఇదే సమయంలో.. స్కూల్‌లోని కొందరు ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులకు కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి.. దీంతో.. 20 మందికి పైగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించారు.. రేపు రిపోర్టులు రానుండగా.. విద్యార్థులు, వారి కుటుంబాలు, మిగతా ఉపాధ్యాయులు ఆందోళన నెలకొంది. కాగా, మొదటల్లో 9, 10 తరగతల నిర్వహణ వరకే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఈ మధ్యే 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కూడా ఫిజికల్​క్లాసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో స్కూల్‌లో కరోనా లక్షణాలు బయటపడడం.. ఆందోళన కలిగిస్తోంది.