అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన ఆరుగురికి పాజిటివ్.. 70 మందికి టెన్ష‌న్‌...

అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన ఆరుగురికి పాజిటివ్.. 70 మందికి టెన్ష‌న్‌...

క‌రోనా కాలంలో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లాల‌న్నా ఆందోళ‌నచెందాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో వారం రోజుల్లో భార్యాభర్తలు మృతి చెందారు.. కరోనా లక్షణాలతో హోం క్వారంటెన్‌లో ఉన్న రాజేష్(35) అనే యువకుడు బాత్ రూంలో జారిప‌డి ఈ నెల 7న మృతిచెంద‌గా.. అత‌ని భార్య (30) కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు. ఇక‌, మృతుడు రాజేష్ కూతురు, అతని తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.. మ‌రోవైపు.. రాజేష్ అంత్యక్రియలకు హాజరైన మరో ఆరుగురు బంధువులకు తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలింది... రాజేష్ అంత్యక్రియలకు 70 మంది వరకు హాజ‌ర‌య్యారు.. ఇప్ప‌టికే ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో.. మిగ‌తా బంధువులు, స్నేహితుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఇక‌, ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా.. రాజేష్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన అంద‌రికీ క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హిస్తున్నారు వైద్య సిబ్బంది.