కరోనా పాజిటివ్ అని మృతదేహాన్ని 20 గంటల పాటు వదిలేశారు

కరోనా పాజిటివ్ అని మృతదేహాన్ని 20 గంటల పాటు వదిలేశారు

హైదరాబాద్: ప్రస్తుతం కరోనా రోగి అంటే చాలు వారిని దూరం పెడుతున్నారు ప్రజలు. దాంతో రోగిలు బాధ, అవమానంతొ కుమిలిపోతుంటారు. కరోనా వచ్చిన వారినే అలా చూస్తుంటే.. మరి కరోనా రోగి మరణిస్తే? ఇటువంటి సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. భర్త కరోనా బారిన పడిన నాలుగు రోజులకే మరణించడంతో అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. బాధితుడు వెంకటేష్(55) కరోనా పాజిటివ్ వచ్చిన నాలుగు రోజులకే మరణించాడు. ఆ బాధను తట్టుకోలేక అతడి భార్య ధనలక్ష్మీ(50) మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే వెంకటేష్ స్థానికంగా ఓ కన్‌స్ట్రక్షన్ సంస్థలో పనిచేస్తుండేవాడు. కరోనా అని తేలడంతో హోం క్వారంటైన్‌ను పాటిస్తున్నాడు.

 

అంబేద్కర్ కాలనీలోని అతడి ఇంటిలో గురువారం ఉదయం మరణించాడు. అయితే అతడి మరణాన్ని జీర్ణించుకోలేక అతడి భార్య సాయంత్రం 4 గంటల సమయంలో వారి అపార్టిమెంటు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను అక్కడి స్థానికులు ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి పంపారు. కానీ వెంకటేష్‌ దేహాన్ని తరలించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. శానిటైజేషన్ చసేందుకు మాత్రం కొందరు వచ్చారని తరువాత వారు వెళ్లిపోయారని స్థానికులు అన్నారు. చివరికి పోలీసులు, మున్సిపాలిటీ వారు కూడా వెంకటేష్ తరలించేందుకు సందేహించారని అపార్టిమెంటులోని వారు తెలిపారు. అయితే 20 గంటల తరువాత గాంధీ ఆసుపత్రికి సంబంధించిన ఆంబులెన్స్‌లో వెంకటేష్ దేహాన్ని తరలించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ధనలక్ష్మీ దేహానికి కరోనా నెగిటివ్ రావడంతో ఆమె బంధువుల కోసం చూస్తున్నామని చెప్పారు.

 

వెంవటేష్ దేహాన్ని మార్చురీకి తరలించడానికి కావలసిన సంతకం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులు కూడా సంతకం చేయడానికి ఆలోచించారు. పోలీసులు, మున్సిపాలిటీ వారిని ఆశ్రయించడం చాలా కష్టం అయిందనీ, వారు చాలా ఆలస్యంగా వచ్చారని అక్కడి స్థానికులు తెలిపారు. అయితే మేము ఆలస్యం కాలేదని, ఆమె కరోనా నెగిటివ్ కారణంగా వెంటనే తరలించామని, వెంవటేష్‌ దేహాన్ని తరలించేందుకు సంతకం చేయడానికి కూడా స్థానికులు రాలేదని ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఏరియా మున్సిపాలిటీ డిప్యూటీ కమీషనర్ ఫోన్ కాల్స్‌కు గానీ మెసేజ్‌లకు స్పందించలేదని అన్నారు. కేసును పరిశీలిస్తామని, మాయందు ఎటువంటి ఆలస్యం కాలేదని అధికారులు తెలిపారు.